Navaratri: వాడపల్లి శరన్నవరాత్రులు.. వెంకన్న కోసం వేలాదిగా భక్తజనులు

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక పేరుగాంచిన ఆ దివ్య క్షేత్రంలో స్వామివారు కొలువైన గుడికి అమ్మవారి ఉత్సవాలు సైతం అత్యంత ఆధ్యాత్మిక పరమంగా జరుగుతాయట. ఇక అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినాలు కావడంతో ఇటు స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆ పచ్చని జిల్లాకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారట. అటువంటి పుణ్య దాహం ఎక్కడుంది అక్కడ జరుగుతున్న ఉత్సవాలు ఏంటి ఒకసారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ తిరుపతిగా పేరుగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య అంతకంత పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఈనెల 15వ తేదీ నుంచి అమ్మవారికి శరన్నవరాత్రులు మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవారికి తమ్ముడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్ ఎర్రచందన రూపిడిగా ఈ దివ్య క్షేత్రంలో వెలిసిన తరుణంలో వేలాదిగా భక్తులు ముందు రోజు క్షేత్రానికి చేరుకున్నారు.

తీరొక్క పువ్వులతో బతుకమ్మ.. ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం!

ఆంధ్రప్రదేశ్

తూర్పు గోదావరి

ఎర్రచందన రూపును దర్శించుకునేందుకు గత అర్ధరాత్రి 12 గంటల నుంచి భక్తులు క్షేత్రానికి చేరుకుని ఏడు వారాలకు సంబంధించిన ప్రదిక్షణలు ప్రారంభించారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో స్వామివారికి కైంకర్యాల పూజ చేసి మంగళ హారతి అనంతరం భక్తులకు ఆలయ అధికారులు దర్శన భాగ్యం కల్పించారు. ఇసుకేస్తే రాలని విధంగా భక్తజన సందోహం వేలాదిగా వాడపల్లి క్షేత్రానికి చేరుకున్నారు.

ఎంగిలి పూల బతుకమ్మ ప్రత్యేకత ఇదే!

ప్రధానంగా ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ చందన రూపంలో స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామిని మనలో న్యాయబద్ధమైన కోరిక కోరుకుని ఏడువారాలు దర్శించి ఏడు ప్రదక్షిణలు చేసినట్లయితే వారి కోరిక తప్పక సిద్ధిస్తుందని భక్తులే ఎంతో ప్రగాఢ విశ్వాసంగా పేర్కొంటున్నారు.

ఇక శరన్నవరాత్రులు సైతం ఆదివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవస్థాన కార్యనిర్వాహణాధికారి, చైర్మన్ పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వాడపల్లి ప్రారంభం మొదలు ఎక్కడ చూసినా భక్త జన సందోహమే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల ప్రతి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సు స్థిరవారం వచ్చిందంటే చాలు వాడపల్లికి చేరుకుంటాయి. ఇలా కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వాడపల్లి వెంకన్నబాబు దివ్యక్షేత్రం దినదిన అభివృద్ధి చెంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కలిప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవముగా ఈ దివ్యక్షేత్రంలో శ్రీవెంకటేశ్వరస్వామి తీరుస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Local News, Local18 Andhra Pradesh, Local18 AP, Local18 Telugu

Source link

Related Articles

Latest Updates