తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయనకు చల్లదనం కల్పించేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం రాజమహేంద్రవరం జైలు అధికారులను ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యుల నివేదిక మేరకు.. తగిన ఏర్పాట్లు చేసే విధంగా జైలు అధికారులను ఆదేశించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. దీనిపై న్యాయాధికారి ఆన్లైన్లో విచారించి ఆదేశాలు జారీ చేశారు.
Published : 15 Oct 2023 10:04 IST
