దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఆదివారం భూప్రకంపనలు (Earthquake in Delhi) చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 3.1 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఆదివారం భూప్రకంపనలు (Earthquake in Delhi) చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 3.1 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది.
హరియాణలోని ఫరీదాబాద్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు భూకంపానికి సంబంధించి తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా, నేపాల్‌లో 6.2 తీవ్రతతో వణికించిన భూకంపం అనంతరం ఢిల్లీ, పంజాబ్, హరియాణ, యూపీ సహా ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో భూకంపం అనంతరం తాజా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Read More :
Congress | 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..

