Pawan Kalyan criticizes government’s insensitive approach towards Chandrababu’s health condition.

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఈ ప్రభుత్వ వైఖరి అమానవీయం. ఆయన ఆరోగ్య సమస్యలపై మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదు. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం సరికాదు. జైళ్లశాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయి.చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని పవన్‌ వెల్లడించారు.

చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు

మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని వారు జైలు అధికారులను కోరారు. తాజా నివేదికను ఇప్పటివరకు కుటుంబసభ్యులకు ఇవ్వకపోవడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Updates