Prabhas starred salaar movie streaming on netflix from today january 20 and guntur karam to stream on netflix from february 10 | Salaar-Guntur karam OTT Dates: ఓటీటీలో వచ్చేసిన సలార్, గుంటూరు కారం ఎప్పుడంటే

Salaar-Guntur karam OTT Dates: సంక్రాంతి తరువాత కూడా ఓటీటీ వేదికలు పండుగ చేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమా సలార్, సూపర్ హిట్ మూవీ గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీలు ఖరారు చేసుకోవడంతో ఓటీటీ ప్రేక్షకులు ఖుష్ అయిపోతున్నారు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం..

ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్ ఎలాంటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు చేసింది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 800 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి తరువాత సరైన హిట్ లేకుండా పోయిన ప్రభాస్‌కు ప్రశాంత్ నీల్ భారీ హిట్ అందించాడు. సలార్ మొదటి భాగం కలెక్షన్ల ఊచకోత కోసింది. విడుదలైన నెల రోజులు పూర్తి కాకుండానే ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ అంటే జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

ఇక త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా గుంటూరు కారం బ్లాక్ బస్టర్ స్థాయిలో కాకున్నా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 13 ఏళ్ల తరువాత ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన గుంటూరు కారం సినిమాకు మిశ్రమ స్పందన లభించినా వసూళ్లు భారీగానే ఉన్నాయి. అయితే ఇంకా నెలరోజులు కాకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ చేసుకుంది. గుంటూరు కారం సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు చేజిక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. 

ఇవాళ్టి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సలార్, ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానున్న గుంటూరు కారం సినిమాలు ఓటీటీలో ఎలాంటి హల్‌చల్ చేస్తాయో చూడాలి. మొత్తానికి ఓటీటీ ప్రేక్షకులకు మాత్రం గత కొద్దిరోజులుగా కొత్త కొత్త సినిమాలతో వినోదం బాగానే లభిస్తోంది. 

Also read: Chandrababu Helicopter Missing: చంద్రబాబు హెలీకాప్టర్ మిస్సింగ్, బాబు సురక్షితమేనా, అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Source link

Related Articles

Latest Updates