Animal Movie | యానిమల్‌లో రక్తం ఏరులై పారుతుందట.. సందీప్‌ రెడ్డి అసలేం ప్లాన్‌ చేశాడో?-Namasthe Telangana

Animal Movie | డిసెంబర్ 1 ఎప్పుడెప్పుడు వస్తుందా అని యావత్ ఇండియా మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. టీజర్‌, పాటలతోనే యానిమల్‌ సినిమాపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా.


Animal Movie | డిసెంబర్ 1 ఎప్పుడెప్పుడు వస్తుందా అని యావత్ ఇండియా మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. టీజర్‌, పాటలతోనే యానిమల్‌ సినిమాపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇంకా ట్రైలర్‌ కూడా రిలీజ్‌ కాలేదు.. అప్పుడే బిజినెస్‌ లెక్కలు గుండెళ్లో గుబులు పుట్టిస్తున్నాయి. సౌత్, నార్త్ అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్‌లు హక్కుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారట. అప్పుడెప్పుడు కబీర్ సింగ్ టైమ్‌లో సందీప్‌.. అందరూ కబీర్‌ సింగ్‌ను వైలెంట్ సినిమా అంటున్నారు. అసలు వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్‌ సినిమాలో చూపిస్తా అంటూ ఓ బోల్డ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

ప్రీ టీజర్‌తోనే ఆ స్టేట్‌మెంట్‌కు జస్టిఫికేషన్‌ ఇచ్చాడు. ఇక సినిమా రిలీజ్‌ దగ్గరికొస్తున్న కొద్ది కొన్ని లీకులు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లీకులు సోషల్ మీడియాను ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి. ఈ సినిమాలో విలన్లను నరభక్షకులుగా చూపించబోతున్నాడట. అంటే విలన్‌లు మనుషుల్ని తింటారట. ఇప్పటివరకు హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు బోలెడు వచ్చాయి. ఇండియన్ సినిమాలోనూ చేతి వేళ్లపై లెక్కపెట్టే సినిమాలు వచ్చాయి. కానీ జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

అయితే సందీప్‌ వంగా మాత్రం ఈ సీన్లకు జస్టిఫికేషన్ ఇచ్చే ప్లాష్‌ బ్యాక్ సీన్లు కూడా డిజైన్‌ చేశాడట. ఇక ఈ సినిమలో రణ్‌బీర్‌ ఫ్యామిలీ అత్యంత క్రూరంగా మనుషుల్ని చంపుతుంటారట. వాళ్లను మార్చడానికి రష్మిక విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. ఇక ఈ సినిమలో రక్తపాతం ఊహించని రేంజ్‌లో ఉంటుందని.. మనం ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంటామో దానికి వంద రేట్లు ఎక్కువే ఉంటుందని సినిమాలో నటించిన వాళ్లు చెబుతున్నారు. బార్డర్‌లు పెట్టుకున్న టాలీవుడ్‌కే అర్జున్‌ రెడ్డిలాంటి అల్టిమేట్‌ సినిమానిచ్చినప్పుడు.. ఇప్పుడు అసలు బార్డర్‌లు లేని యానిమల్‌తో ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తాడో ఊహకు కూడా అందకుండా ఉంది.

Next article

తాజా వార్తలు

Source link

Related Articles

Latest Updates