అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ములాఖత్‌కు ప్రయత్నిస్తున్నారు. ములాఖత్ కోసం జైలు అధికారులను వారు సంప్రదిస్తున్నారు.
